BREAKING
దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు

గ్రామాభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తా

Select Suryaa Now
గ్రామాభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తా

గ్రామాభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తా

- అసంపూర్తి పనుల పూర్తే నా ధ్యేయం

- ఎమ్మెల్యే ఉగ్ర ప్రకటించిన అభ్యర్థుల గెలుపే లక్ష్యం

- మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్

పామూరు, మేజర్ న్యూస్ : 

తన సొంత గ్రామమైన తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ అన్నారు. పామూరు మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ (ఇరిగినేని నగర్)లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల స్థానికులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో గ్రామాభివృద్ధి కుంటుపడిందని అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు అవసరమైన నిర్మాణ పనులను సొంత నిధులతో చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. బీసీ కాలనీలోని రామాలయం, చౌడమ్మ, పెద్దమ్మతల్లి గ్రామ దేవతల దేవస్థానాలు, జంగాలపల్లిలోని గంగమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఎస్సీ కాలనీలోని ప్రార్థనా మందిరం అభివృద్ధితో పాటు ఎస్సీ స్మశానవాటిక వద్ద షెడ్డు నిర్మాణం, నీటి వసతి కోసం బోరు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోతవరం స్మశానవాటికకు రహదారి నిర్మాణంపై స్థానిక రైతులతో చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు అద్దంకి బాల నాగయ్య, కోటయ్య, మాల్యాద్రి, రామయ్య, చెనికల చినమాలకొండయ్య అండ్ బ్రదర్స్, పుల్లయ్య, జంగిటి నాగయ్య, చల్లకొలుసు నాగయ్య, బిస్కెట్, ధనియాల తిరుపతయ్య, మానం నాగేశ్వరరావు, కిరణ్, బాజీ యాదవ్, వెంగళరావు, చెనికల మల్లికార్జున, తాళ్లూరి పాములయ్య బ్రదర్స్, తాతపూడి నరసయ్య అండ్ బ్రదర్స్, బండారు ప్రసాద్ అండ్ సన్స్, ఏసుపోగు నాగేష్, తాళ్లూరి రాజకుమార్ అండ్ బ్రదర్స్, తాళ్లూరి కృపయ్య అండ్ సన్స్, డానియాలు, జయరావు, సవరం అంకయ్య, లక్ష్మయ్య, దండే వెంకటేశ్వర్లు, మాదర పాకం, దండే వెంకటేశ్వర్లు (రియల్టర్), దండే తిరుపతయ్య, దేవరకొండ చెన్నకేశవులు, బాలయ్య, దేవరకొండ సుబ్బమ్మ, అంకయ్య, చెన్న కృష్ణయ్య, చెన్నకేశవులు, ఆదిలక్ష్మమ్మ, వెంగమ్మ, ఇర్ల రాజు, రమేష్, వెంకటేష్, జంగమయ్య, బండారు వెంగయ్య, మీడియం సుబ్బరాయుడు, దారపనేని రాజేంద్రప్రసాద్, తిరివీధి చంద్ర, కల్లూరి సురేష్, తిరివీధి ముకుందరావు, ఆరే తిరుపాలు, గడ్డం తిరుపతిరావు, పెండ్యాల శ్రీనివాసులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు