BREAKING
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల అద్భుత సినీ ప్రస్థానం.. నటుడిగా, నాయకుడిగా ప్రత్యేక ప్రయాణం! రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు 'గోల్డ్ స్పాట్' నుంచి మనసు దోచేలా 'పరిచయమే' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడీ! మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్ అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు ఏర్పాట్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. కానిస్టేబుల్ రంగస్వామి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే చిత్రలేఖన పోటీల్లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి విద్యార్థిని షేక్ అప్సర్‌కు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు

*గ్రామ సేవకుల పోరు బాట దరి చేరేనా?*

Select Suryaa Now
*గ్రామ సేవకుల పోరు బాట దరి చేరేనా?*

*ఇరగవరం మేజర్ న్యూస్ *గ్రామ సేవకుల పోరు బాట దరి చేరేనా?*గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించాలని గత కొద్దిరోజులుగా పోరుబాట(రిలే నిరాహార దీక్ష) పట్టిన

  గ్రామ సహాయకులు (వి.ఆర్.ఏ)ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా పే స్కేల్ కోరుతూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

 ప్రభుత్వ సేవకులు అయినప్పటికీ ఏపీ విలేజ్ సర్వెంట్ సర్వీస్ రూల్ 2005 ప్రకారం గౌరవభృతి పొందిన వారికి పార్ట్ టైం ఉద్యోగులకు పే స్కేలు వర్తించదు. పెన్షన్ రాదు. ఇవేమి లేకుండా పదవి విరమణ  తర్వాత లక్ష రూపాయలు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.

 **వి ఆర్ ఏల గురించి వివరంగా**అనాదిగా ఉన్న కరణం మునసబు వ్యవస్థను 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఒక కలం పోటుతో రద్దు పరిచారు. అంతకుముందు వీరికి అయితే అధికారం హోదా లేదు ₹50 నుంచి 500 రూపాయలు వరకు భృతి పొండేవారు. అది కాస్త 2011లో 1700రూపాయలు. 2014లో 6500రూపాయలు.2018 లో 10500రూపాయలు మరియు 500 కరువు భృతితో గ్రామ సేవకుడు అనే గౌరవప్రద హోదా పొందారు.

 *అందించిన సేవలు :* 

 చావు కాడ.. సన్నాయి.. కాడ వీరే. గ్రామ రక్షక భటులు వీరే. వసూలు అయిన పన్నులు ఖజానాల్లో జమ చేసింది వీరే. ఆటుపోట్లును భరించి సహృదయ రైతు పన్నుతో పాటు సంతోషంగా ఇచ్చిన సంభావన, మరో రైతు చీత్కారాన్ని దీవేనలుగా భావించిన వారు వీరే వీరు శ్రమించిన శ్రమే వేరు 

 *న్యాయమైన కోర్కెలు :* ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణించడం పే స్కేలు సవరించడం సచివాలయ ఉద్యోగి తరహా నియామకం తర్వాత రెండు సంవత్సరాలు ప్రోబెటరీ తర్వాత రాష్ట్రీయం చేయాలి.సర్వీసు రూల్స్ వర్తింప చేయాలి.రాష్ట్రంలో సుమారు 28 వేలు వరకు గ్రామ సేవకులు విధులు నిర్వర్థిస్తున్నారు వారికి ఏడాదికి 350 కోట్లు పై చిలుకు ఖర్చులు చేస్తున్నారు.మూడు లక్షల కోట్ల బడ్జెట్ ముందు ఈ గ్రామాసేవకుల ఖర్చు సముద్రంలో నీటి బిందువంత.కనీసం ఫిక్స్డ్ స్టైఫండ్ లో 15 వేల రూపాయిల గౌరవ భృతిగా ఇచ్చిన వీరిని ఆదుకునుటకు ప్రభుత్వం ఎందుకు ముందుకురావడంలేదు.

 *ఆలోచించాలి :* ఒకసారి కేంద్ర విధానం పరిశీలిద్దాం తపాలా శాఖలో మెసెంజరు కూడా పార్టీ టైమ్ ఉద్యోగే 4,5గంటల పని టీ ఆర్ సి ఏ ప్రకారం బేసిక్ పే 15 వేల రూపాయలు నుండి 18 వేల రూపాయలు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్  ఉద్యోగులకంటే వి ఆర్ ఏ తక్కువా? వీరి ఉద్యోగం భాద్యతలు చిన్నవా?

 ప్రభుత్వంపై గ్రామ సేవకుల  నమ్మకం  ప్రభుత్వ భాద్యతలు విస్మరించారు. పరిష్కారం వస్తుందనే నమ్మకం వారిది ప్రభుత్వ బిడ్డలుగా తమ కోర్కెలు తప్పుకాదు. వారి హక్కు.దీనిపై సాధ్యసాధ్యాలు పరిశీలించాల్సిన బృహత్తార భాద్యత ప్రభుత్వానిదే. అభివృద్ధి,సంక్షేమం జీతభత్యాలు,పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహకాలు, విపత్తులు వీటన్నిటిని సమన్యాయం చేసుకోవలసింది ప్రభుత్వమే అయినా అసాధ్యలన్ని సుసాధ్యం చేయగల సహసీ సూపరిపాలకుడు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు.సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారని గ్రామ సేవకుల దృఢ నమ్మకం.వీరి సేవలను గుర్తించి అనాదికాలంగా వెట్టి చాకిరీలో మగ్గిపోయిన తమ కోర్కెలు నెరవేర్చాలని వి ఆర్ ఏ లు కోరుతున్నారు 

దాయం దొరబాబు రిపోర్టర్ ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా