BREAKING
ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా?

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి

Select Suryaa Now
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి  :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి

కారంచేడు,మేజర్‌న్యూస్‌  :

 ఈ నెల 26 న జరగనునున్న పంచాయతీ ఎన్నికల కు సంబంధించి పోలింగ్ & కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు  పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి.,పేర్కొన్నారు. సోమవారం కారంచేడు మండల పరిధిలోని స్వర్ణ మరియు కేశవర ప్పాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ & కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు ను మరియు స్వర్ణ పంచాయతీ కార్యాలయం లో స్వీకరిస్తున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా  జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 
ఈ నెల 15 నుంచి 17 వరకు  సర్పంచ్  / వార్డు సభ్యుల కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరించాలన్నారు. ఈ నెల 26 న జరగనునున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ మరియు కౌంటింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత  అధికారులను ఆదేశించారు.
కేంద్రాల్లో అభ్యర్థులు అవసరమైన తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని,
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద మరియు పోలింగ్ & కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు నిబంధనలను పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట చీరాల  రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ నరసింహా రావు, తహశీల్దార్ మాధవిలత,యం పి డి ఓ.నేతాజీ, పంచాయతీ కార్యదర్శిలు,సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.