BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

గోళ్ళ గ్రామం లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిక.

Select Suryaa Now
గోళ్ళ గ్రామం లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిక.

కళ్యాణదుర్గం :-గొల్ల గ్రామపంచాయతీలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనకు పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. గ్రామస్థాయిలో చోటుచేసుకున్న ఈ చేరిక స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గోళ్ సూర  పంచాయతీ అధ్యక్షులు నారాయణపురం శివన్న పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు ఏకాంతరెడ్డి, పోతేష్, నారాయణస్వామి, గుండ్లపల్లి ఆంజనేయులు, నాగభూషణం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు వెంకటేష్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు తెలిపారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రజల మద్దతు పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వెంకటేష్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.