BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

గంగడిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ యువ నాయకుడు నాయుడు వెంకట్ నాగరాజు పోటీకి సిద్ధం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..

Select Suryaa Now
గంగడిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ యువ నాయకుడు నాయుడు వెంకట్ నాగరాజు పోటీకి సిద్ధం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..

రేపల్లె మేజర్ న్యూస్; గంగడిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు నాయుడు వెంకట్ నాగరాజు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం  పత్రికా ప్రకటన విడుదల చేసి గ్రామ ప్రజల మద్దతును కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకర్షించాయని, పేదలు, రైతులు, మహిళలు, యువత, నిరుపేద కుటుంబాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితోనే బీజేపీలో చేరినట్లు వెంకట్ నాగరాజు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం గ్రామాల్లో ఉచిత రేషన్ బియ్యం, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, వీధి దీపాలు, శ్మశానవాటికలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ పథకాల పాత్ర కీలకమని ఆయన వివరించారు.అలాగే పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఉజ్వల యోజన, మాతృ వందన యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా, ఈ-శ్రమ్, కౌశల్ వికాస్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలు ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులకు ఎరువులపై సబ్సిడీలు, భూసార పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డులు, మహిళా సంఘాలకు రుణ సదుపాయాలు, బాలింతలకు పోషకాహారం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ డిజిటల్ అక్షరాస్యత, నీటి సరఫరా, వాననీటి సంరక్షణ తదితర కార్యక్రమాలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని వివరించారు.
గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం
దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం బీజేపీ ప్రభుత్వ విధానాలతో మరింత ముందుకు సాగుతున్నాయని వెంకట్ నాగరాజు పేర్కొన్నారు. గంగడిపాలెం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు అందరూ తనకు సహకరించి విజయానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పిన్ని సాంబశివరావు, ఎస్. రాజు, ఎం. కృష్ణ ప్రసాద్ తదితరులు ప్రకటన విడుదలలో పాల్గొని నాయుడు వెంకట్ నాగరాజుకు మద్దతు తెలిపారు.