గిద్దలూరులో కిసాన్ మేళా–2026.. రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన*
*వ్యవసాయ, అనుబంధ శాఖల విజ్ఞాన ప్రదర్శనను సందర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి*
గిద్దలూరు మేజర్ న్యూస్ :
*గిద్దలూరు: పట్టణంలోని తిరుమల కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా–2026 కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధానాలపై వివరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.*
*ముందుగా రైతులు పండించిన , ఆర్గానిక్ పంటలు, రసాయనాలు కొనుగోలు వంటి వాటిని స్టాల్ ఏర్పాటును ఎమ్మెల్యే గారు సందర్శించి వాటి పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించినారు కిసాన్ మేళాలో భాగంగా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శన ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించారు. రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకుని, సాగులో మెరుగైన ఫలితాలు సాధించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రైతు కుటుంబ నుండి వచ్చిన మాకు. వ్యవసాయ రంగంలో కొంత అనుభవం, ఉందని కానీ నేడు ఎలినో ప్రభావంతో వర్షాలు పడక భూమి ఉష్ణోగ్రత పెరిగి సరిగా నీరులేక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఉచిత విత్తనాలు రైతులకు అందించారు చివరగా ఉత్తమ రైతులను శాలువ, ప్రశంసా పత్రం , మెమంటో ఇచ్చి సన్మానించారు*
*కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు అభిమానులు భారీగా పాల్గొన్నారు*