గాంధీ విగ్రహానికి ఘన నివాళి – బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు
బాడంగి, అక్టోబర్ 2 (మేజర్ న్యూస్):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బాడంగి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ విగ్రహానికి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మహాత్ముడిని స్మరించుకున్నారు.
ముందుగా టీడీపీ మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు, మాజీ ఎంపీటీసీ దేవరపల్లి శ్రీనివాసరావు, గ్రామ పెద్ద అడ్వకేట్ గు ణుపూరు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో వారితోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు