BREAKING
హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ* *మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేలా చర్యలు చేపట్టాలి* *మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు * వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు తెగుళ్లు - ఏ డి ఏ అపర్ణ # చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు

గాజువాకలో ఘనంగా అమరవీరుల సంస్మరణ.. విద్యార్థులకు పోలీసు సేవలపై చైతన్యం

Select Suryaa Now
గాజువాకలో ఘనంగా అమరవీరుల సంస్మరణ.. విద్యార్థులకు పోలీసు సేవలపై చైతన్యం

గాజువాక, సూర్య : పోలీసు అమరవీరుల గుర్తుగా గాజువాక పోలీస్ స్టేషన్‌లో శనివారం 'ఓపెన్ హౌస్' కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, సీఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనగర్‌కు చెందిన శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. ​ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, బాధ్యతలు మరియు ప్రజలకు అందించే సేవల గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, కేసులు నమోదు చేయడం, దర్యాప్తు ప్రక్రియ మరియు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. పోలీసులు విధుల్లో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రదర్శించి, వాటి ఉపయోగాలు వివరించారు. నేర పరిశోధనలో సాంకేతికత ఏ విధంగా తోడ్పడుతుందో అధికారులు తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, చట్టాల పట్ల అవగాహన మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.