BREAKING
గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం కృష్ణానదిలో మృతదేహం లభ్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కోసం ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Select Suryaa Now
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

 

అమరావతి: మంగళగిరి, తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల్లో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి, వరద నివారణ పనుల కోసం రూ.68.73 కోట్ల పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తు నివారణ నిధి (SDMF) కింద మొత్తం 37 కీలక పనులను చేపట్టేందుకు ఈ నిధులను కేటాయించారు.

ఈ కేటాయింపుల్లో భాగంగా మంగళగిరి డివిజన్‌లో రూ.33 కోట్లతో 26 వరద నివారణ పనులను, తాడేపల్లి డివిజన్‌లో రూ.35.73 కోట్లతో 11 అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వర్షాకాలంలో నివాస ప్రాంతాలు జలమయం కాకుండా డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించడంతో పాటు వరద ఉధృతిని సమర్థవంతంగా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.