BREAKING
రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం!

ఎన్నికలకు మొత్తం 154 నామినేషన్ల దాఖలు

Select Suryaa Now
ఎన్నికలకు మొత్తం 154 నామినేషన్ల దాఖలు


ఆమదాలవలస, నవంబర్  16, మేజర్ న్యూస్
ఆమదాలవలస పురపాలక సంఘ సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం తుది గడువుతో ముగియగా, మూడు రోజుల్లో ఛైర్‌పర్సన్‌, 28 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు కలిపి మొత్తం 154 నామినేషన్లు దాఖలైనట్లు సహాయ ఎన్నికల అధికారి, పురపాలక కమిషనర్‌ టి రవి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చివరి రోజైన సోమవారం ఒక్కరోజే 114 నామినేషన్‌ పత్రాలు అందగా, పట్టణంలోని 28 వార్డుల కౌన్సిలర్‌ స్థానాలకు సోమవారం దాఖలైన 110 నామినేషన్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం 148 నామినేషన్లు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కౌన్సిలర్‌ స్థానాలకు అందిన 148 నామినేషన్లలో తెదేపా తరఫున 62, వైకాపా నుంచి 60, జనసేన తరఫున 13, భాజపా నుంచి 5, స్వతంత్ర అభ్యర్థులుగా 8 నామినేషన్లు దాఖలయ్యాయని వివరించారు.
ఛైర్‌పర్సన్‌ పదవికి సంబంధించి సోమవారం దాఖలైన 4 నామినేషన్లతో కలిపి మొత్తం 6 నామినేషన్‌ పత్రాలు అందాయని కమిషనర్‌ వెల్లడించారు. ఇందులో తెదేపా తరఫున 3, వైకాపా నుంచి 2, కాంగ్రెస్‌ తరఫున 1 నామినేషన్‌ సమర్పించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పూర్తి పారదర్శకంగా ముగిసిందని, తదుపరి షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం నామినేషన్ల పరిశీలన చేపడుతామని పేర్కొన్నారు.