BREAKING
మెట్టెక్కివలస ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు అందజేత ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నర్సీపట్నం మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల పరిశీలన " సామాజిక సేవ నుండి ప్రజా క్షేత్రం వైపు " శివాలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు తాటి బాలు త్రివిధ దళాల మాజీ సైనికులతో బిజెపి రాష్ట్ర చీఫ్ సమావేశం.. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో పోలమాంబ దర్శనం రైలు ఢీకొని 130 గొర్రెలు మృతి! 26వ వార్డులో రూ. 40 లక్షలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష విరాళం లయన్స్ క్లబ్ సౌజన్యంతో విజ్ఞాన భారతిలో మొక్కలు నాటే కార్యక్రమం.. మినీ గురుకులాల సిబ్బందిని రెగ్యులర్ చేయాలి ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి. * చారిత్రక సంపదను కాపాడుకోవడం భక్తుల బాధ్యత బుధవారం నాడు జాబ్ మేళా

ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలకు ఫుల్‌స్టాప్‌ రక్షణ సామగ్రితో సన్నద్ధమైన జిల్లా పోలీస్ యంత్రాంగం ‘వజ్ర’ వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాల తనిఖీ ఎన్నికల ప్రశాంత నిర్వహణే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్

Select Suryaa Now
ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలకు ఫుల్‌స్టాప్‌  రక్షణ సామగ్రితో సన్నద్ధమైన జిల్లా పోలీస్ యంత్రాంగం  ‘వజ్ర’ వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాల తనిఖీ  ఎన్నికల ప్రశాంత నిర్వహణే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్

అనంతపురం బ్యూరో : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతోపాటు జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధునాతన ఆయుధాలు, రక్షణ సామగ్రి, ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) ప్రాంగణంలో పోలీస్ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రక్షణ పరికరాలు, ఆయుధాలు, వాహనాలను జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎన్నికల విధుల్లో పోలీసుల సన్నద్ధత, భద్రతా సామగ్రి అందుబాటు, వాటి పనితీరుపై ఎస్పీ స్వయంగా సమీక్షించారు. అవసరమైన సామగ్రి నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో తలెత్తే వివిధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బందిని అన్ని విధాలుగా సిద్ధం చేయాలని సూచించారు.

అత్యాధునిక రక్షణ సామగ్రి పరిశీలన

పోలీసుల భద్రత కోసం అందుబాటులో ఉన్న రోబోటిక్ డ్రస్‌లు, బాడీ ప్రొటెక్టర్లు, హెల్మెట్లు, లాఠీలు, రక్షణ కవచాలను ఎస్పీ పరిశీలించారు. అలాగే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించేందుకు వినియోగించే టియర్ స్మోక్ గ్రనేడ్లు, స్టన్ గ్రనేడ్లు, స్టన్ షెల్స్, మార్కర్ గ్రనేడ్లు, టియర్ గ్యాస్ మందుగుండు సామగ్రి పనితీరు, అందుబాటుపై వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ గన్స్, రైట్ గన్స్, రబ్బర్ పెల్లెట్లు వంటి ప్రత్యేక పరికరాలను కూడా తనిఖీ చేశారు.

‘వజ్ర’, వాటర్ కేనన్ వాహనాలు.. డ్రోన్లతో నిఘా

ఎన్నికల బందోబస్తులో కీలకంగా ఉపయోగించే ‘వజ్ర’, వాటర్ కేనన్ వాహనాలు, శక్తి వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణ ద్విచక్ర వాహనాలను ఎస్పీ పరిశీలించారు. డ్రోన్లు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను అవసరమైన సమయాల్లో సమర్థవంతంగా వినియోగించేలా సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

సున్నిత ప్రాంతాల భద్రతపై ప్రత్యేక దృష్టి

అత్యవసర పరిస్థితుల్లో నిరసనలు, అల్లర్ల కారణంగా అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా నిరోధించేందుకు ఉపయోగించే కన్సర్టినా కాయిల్స్‌ను ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా పరిమితులను ఏర్పాటు చేయడంలో వీటి వినియోగంపై సమీక్షించారు. అవసరమైన సమయంలో తక్షణమే భద్రతా ఏర్పాట్లు చేపట్టేలా సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలి

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన రక్షణ సామగ్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అనంతపురం అర్బన్ డీఎస్పీ కరుణాసాగర్ రావు, ఆర్‌ఐలు పవన్ కుమార్, మధు, రాముడు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.