ఎంప్లాయిమెంట్ స్కిల్స్ సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభం. "
కైకలూరు, మేజర్ న్యూస్ , స్థానిక కైకలూరు వైవిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ (ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్) విభాగం ఆధ్వర్యంలో బిఏ విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల చరిత్ర శాఖాధిపతి డాక్టర్ ఎం హరి ప్రసాద్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై. శ్రీలత అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ యువత ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలగా ఎదగాలి స్థానిక అవసరాలు తమ నైపుణ్యాలు మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలి అన్నారు. అనంతరం సర్టిఫికెట్ కోర్సు కు సంబంధించిన బ్రోచర్ని ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీలత, ఎకనామిక్స్ హెడ్ డాక్టర్ బి. వేదాంతం, పాలిటిక్స్ హెడ్ డాక్టర్ వీర్రాజు మరియు విద్యార్థిని విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చరిత్ర శాఖాధిపతి డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యాపారం ప్రారంభించాలి అనే వారికి సరియైన శిక్షణ, ప్రణాళిక, మార్కెట్ పై అవగాహన ఆత్మవిశ్వాసం స్వయం ఉపాధి అవకాశాలపై ఈ కోర్సులో విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని, దీనివలన విద్యార్థినీ ,విద్యార్థులు స్వయం ఉపాధి అవకాశాలుగా అందిపుచ్చుకోవడానికి ఎంటర్ప్రైన్యూర్ గా ఎదగటానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అనంతరం బిఏ విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సు కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.