ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీలలో స్థానిక సెలవు ప్రకటన
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీలలో స్థానిక సెలవు ప్రకటన
తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్ :
తిరుపతి జిల్లాలో 2026 సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న రెండవ సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్, స్థానిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలు ఇతర భవనాలకు 2026 నవంబర్ 4వ తేదీన (బుధవారం) పోలింగ్ జరిగే 2026 నవంబర్ 5వ తేదీన (గురువారం) స్థానిక సెలవు ప్రకటించారు.అదేవిధంగా, పోలింగ్ జరిగే ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు ఇతర ప్రభుత్వ సంస్థలకు 2026 నవంబర్ 5వ తేదీన (గురువారం) స్థానిక సెలవు ప్రకటించారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు, సంబంధిత అధికారులు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.