ఎమ్మిగనూరు వైకాపా జడ్పిటిసి రాజీనామాకు సిద్ధం..?
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మినూరు మండలం జడ్పిటిసిగా గెలుపొందిన చిట్టెమ్మ తన జెడ్పిటిసి పదవికి రాజీనామా చేసింది ఒక రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.. ఎమ్మిగనూరు మండలంలో 21 ఎంపీటీసీలకు గాను కలగట్ల ఎంపీటీసీ మహేశ్వర్ గౌడ్ సతీమణి మంజుల తెదేపా అభ్యర్థి నరసన్న గౌడ్ పై 600 పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు.. ఎందుకు కారణం చిట్టెమ్మ భర్త అబ్రహం అంటూ మహేశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తుండడంతో ఆయన మనస్థాపానికి గురై అబ్రహం తన సతీమణి చిట్టెమ్మ జడ్పిటిసి సభ్యురాలు గా గెలిచి నా ప్రయోజనం లేని ఆరోపణలు చెయ్యడం ఏమిటని అబ్రహం రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకొన్నట్టు విశ్వసనీయ సమాచారం.
రంగంలోకి ఎర్రకోట ..
ఎమ్మిగనూరు నియోజకవర్గం లో మూడు జడ్పీటీసీ లకు గాను నందవరం టీడీపీ 4469 ఓట్లతో అక్క మహాదేవి గెలుపొందారు. గోనెగండల్లో తిరుపతి నాయుడు టీడీపీ 772 ఓట్ల తో గెలిస్తే ఎమ్మిగనూరు మండలంలో చిట్టెమ్మ 10,163 అత్యధిక మెజార్టీ తో వైసీపీ గెలిచింది.. గెలిచిన ఒక్క జడ్పీటీసీ ని నిలుపు కోనేందుకు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్న కేశవరెడ్డి రంగం లోకి దిగి అబ్రహం తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.
A. R. శరత్ కుమార్
సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా