ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ గంగారాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి, అమ్మవారికి ఆలయ అర్చకులచే పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు ప్రత్యేకంగా పాల్గొని ఎమ్మెల్యేకు స్వామివారి ఆశీస్సులు అందాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు, వేద పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, విద్యార్థులకు, భక్తులకు పండ్లు పంపిణీ చేయడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు, పట్టణ ప్రముఖులు, నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.
Prathap Proddatur Urban Kadapa dt