ఈ నెల 17లోగా టపాసుల విక్రయ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి*....జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్*
మదనపల్లె, అక్టోబర్ 9: దీపావళి పండుగ సందర్భంగా 2026 సంవత్సరానికి టపాసుల విక్రయాల కోసం కొత్త తాత్కాలిక లైసెన్సులు పొందాలనుకునే వారు, ఇప్పటికే లైసెన్సులు కలిగి ఉండి రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త తాత్కాలిక లైసెన్సుల కోసం ఫారం AE-5, రెన్యువల్ కోసం ఫారం RE-1లో దరఖాస్తులను సంబంధిత సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.లైసెన్సుదారులు సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు సూచించిన ప్రదేశాల్లోనే టపాసులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో విక్రయాలు జరిపితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె