BREAKING
దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు

డ్రైవింగ్ స్కూల్ తో నవశకానికి నాంది ప్రగతి పథంలో దర్శి.

Select Suryaa Now
డ్రైవింగ్ స్కూల్ తో నవశకానికి నాంది ప్రగతి పథంలో దర్శి.

డ్రైవింగ్ స్కూల్ తో ఉపాధి, ఉపాధితోనే ఆత్మగౌరవం.

వేలాదిమందికి ఉపాధి అవకాశాలు.

దర్శి అభివృద్ధిలో మరో ముందడుగు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

పట్టుబట్టి డ్రైవింగ్ స్కూల్కు నిధులు మంజూరు చేయించిన గొట్టిపాటి లక్ష్మి.


సూర్య న్యూస్ దర్శి. 

డ్రైవింగ్ స్కూల్ నవ సకానికి నాంది ప్రగతి పథంలో దర్శి పట్టణం  ప్రయనిస్తుందని, అభివృద్ధి లక్ష్యంగా గమ్యంగా కృషి చేస్తున్నట్లు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి నియోజకవర్గానికి అభివృద్ధిలో ప్రధాన భూమికగా ఉన్న ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులును తిరిగి సోమవారం  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ దర్శిలో ఏర్పాటు చేయడం జరిగింది.  దాదాపు 18.5కోట్ల రూపాయలు ఆనాడు నిధులను కేటాయించారు రెండు కోట్లకు పైగా పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో ఇంటర్నేషనల్ డైవింగ్ పనులను నిలిపివేయడం జరిగింది. తిరిగి పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని  గొట్టిపాటి లక్ష్మీ పలుమార్లు కలసి పట్టుబట్టి మరి నిధులు కేటాయించారు.  ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం  ముఖ్యమంత్రి దర్శి అభివృద్ధిలో ముందడుగు అయిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించేందుకు నిధులను మంజూరు చేయడం ఈ ప్రాంత ప్రజానీకానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన చిరుకానుకగా చెప్పవచ్చునని డాక్టర్ లక్ష్మీ అభిప్రాయపడ్డారు.  తొలి విడత పనులను దాదాపు 8.5కోట్లతో చేపడుతున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రకటించారు.  డ్రైవింగ్ స్కూల్ పూర్తయితే సంవత్సరానికి 14500 మంది డ్రైవర్లకు పునఃశ్చరణ తరగతులు, వెయ్యి మందికి భారీ, తేలకపాటి వాహనాలు నడపడానికి డ్రైవింగ్ లో శిక్షణ 4,000 మందికి డ్రైవర్లకు ప్రమాదకరమైన సరుకులు రవాణా చేసి వాహనాల డ్రైవింగ్ పై పునఃశ్చరణ క్లాసులు నిర్వహించబడతాయి.
రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి ఎజెండాగా దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. 
మినీ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణం, డిగ్రీ కాలేజీ నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం,
,టిటిడి కళ్యాణమండపం నిర్మాణం.,అన్నా కాంటీన్ ఏర్పాటు ఇలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దర్శిని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా రోడ్లు డ్రైన్లు విద్యుదీకరణకు మరో 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.  ఇలా అభివృద్ధి ఎజెండాగా సాగుతున్న కూటమి పాలనను ఆదరించాలని అభిమానించాలని డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు.  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలని ఆమె పిలుపునిచ్చారు.  దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం గెలుపు ఏకపక్షంగా జరగాలని ప్రజలందరూ అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించాలని,  అభిమానించాలని కూటమి నేతలు ఐక్యంగా ముందుకు వెళ్లాలని జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసిపి కుట్రలను తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఏకపక్షంగా ఉండాలని డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, ఆర్ అండ్ బి డి ఈ గోపి కృష్ణ, జె . ఈ రఫీ, దర్శి టౌన్  మండల పార్టీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, మారెళ్ల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ నక్క రంగా - చంద్ర, వలిబాబు, జనసేన జిల్లా ఐ.టి కోఆర్డినేటర్ ఉల్లి భ్రమ్మయ్య, నీటి సంగండి. సి అధ్యక్షులు వెలుగొండా రెడ్డి, ఫణిదపు వెంకట్రామయ్య, సానే సుబ్బయ్య, బత్తుల శ్రీనాథ్, బొంత శ్రీను నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.