డిమాండ్లు పరిష్కారానికి చర్చలకు పిలవండి సిఐటియు నాయకులు డిమాండ్.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : కృష్ణపట్నం పోర్టులో కార్మికులు చేస్తున్న న్యాయపరమైన సమస్యలపై పోరాటంలో యాజమాన్యం చర్చలకు పిలవాలని జిల్లా సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రం శ్రామిక భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడారు. కార్మికుల చేసుకుంటున్న ఓటీలను కూడా జీతంలో లెక్కిస్తూ బోనస్ లు ఇవ్వకుండా కార్మికులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కార్మికులును బెదిరించే దూరంలో ఇబ్బందులు పెడుతున్నారని ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అంకయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు