దిబ్బగూడెం కాలువలో మృతదేహం గుర్తింపు
పెదవేగి మేజర్ న్యూస్ పోలవరం కాలువలో గత నెల 21 న లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాన్ని బొబ్బిలికి చెందిన లక్ష్మణరావుగా పోలీసులు గుర్తించారు. నలుపు ప్యాంటు, తెలుపు బనియన్, ఆంజనేయస్వామి ఉంగరం ఆనవాళ్ల ఆధారంగా నిర్ధారించారు. ఓ అక్రమ సంబంధం నేపథ్యంలోనే అతను ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ఇది హత్యా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.