దౌర్జన్యాలు మా పార్టీ సంస్కృతి కాదు... సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం. తంబళ్లపల్లె మహిళా నాయకురాలు సిద్ధమ్మ.
తంబళ్లపల్లె, మేజర్ న్యూస్,
స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, రాళ్ల దాడులు, కర్రల దాడులు, డబ్బు పంపకాలతో అక్రమంగా గెలిచారని ఆ సంస్కృతి టిడిపి రక్తంలోనే లేదని ప్రజల మన్ననులతోనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని తంబళ్లపల్లె నియోజకవర్గం మహిళ నాయకురాలు సిద్ధమ్మ ధీమాగా చెప్పారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్నది మీరు కాదని ప్రశ్నించారు. నేడు ప్రజాస్వామ్యం గురించి శ్రీరంగ నీతులు మాట్లాడే అర్హత వైకాపాకు లేదని ఎద్దేవా చేశారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేసి మా కార్యకర్తలను గాయపరిచి దౌర్జన్యం చేసి డబ్బు మదంతో గెలిచారని భవిష్యత్తులో మీ ఆటలు సాగవని సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం తో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మన్ననలు పొంది ఘన విజయం సొంతం చేసుకుంటామని ఘంటాపతంగా తెలిపారు.
పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె