BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

చిన్న ఎరుకపాడులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవారి దర్శనం

Select Suryaa Now
చిన్న ఎరుకపాడులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవారి దర్శనం

చిన్న ఎరుకపాడులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవారి దర్శనం


నందివాడ - సూర్య ప్రతినిధి : చిన్న ఎరుకపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ బొప్పూడి సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

"సూర్య - నందివాడ ప్రతినిధి(పాల్)