*"చెప్పాం.. చేస్తున్నాం"… పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
విజయనగరం మేజర్ న్యూస్:
కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన "చెప్పాం.. చేస్తున్నాం" పోస్టర్ ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
విజయనగరంలోని మంత్రి పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గంలో జరిగిన వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక సౌకర్యాలు, సూపర్ సిక్స్ - సూపర్ హిట్ పథకాల వివరాలతో కూడిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని, ప్రతి ఇంటికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అదేవిధంగా మరోవైపు విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఈ పోస్టర్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం