చైర్ పర్సన్ గంగాభవానికి ఘన సన్మానం.
పలాస, నవంబర్ 23, మేజర్ న్యూస్.
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం మున్సిపల్ చైర్ పర్సన్ వజ్జ గంగాభవాని ని శుక్రవారం ఘనంగా సన్మానించారు.మున్సిపల్ కమిషనర్ ఈ.శ్రీనివాసులు, మున్సిపల్, మెప్మా సిబ్బంది, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ పి.మోహన్ రావు,టిఎల్ఎఫ్,ఎస్ఎల్ఎఫ్ ఆఫీస్ బేరర్లు,రిసోర్స్ పర్సన్లు పాల్గొని పుష్పగుచ్ఛం,శాలువాతో సత్కరించారు.అలాగే మదర్ థెరిసా స్కూల్ కరస్పాండెంట్ గంగాభవాని ని సూర్యతేజ విద్యా సంస్థల కరస్పాండెంట్ దానేటి పద్మజీ కామేశ్వరరావు,ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.