BREAKING
ఐదు సొసైటీల్లో పదవుల భర్తీపై ఆసక్తి.. సామాజిక సమీకరణాల చుట్టూ చర్చలు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో మృత్యు ఒడిలోకి మూడో వ్యక్తి హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ* *మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేలా చర్యలు చేపట్టాలి* *మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు *

బి ఫారం కావాలంటే రాజాం వెళ్లాల్సిందే .....తెలుగు తమ్ముళ్ళకి తప్పని వ్యయ ప్రయాసలు.…

Select Suryaa Now
బి ఫారం కావాలంటే రాజాం వెళ్లాల్సిందే  .....తెలుగు తమ్ముళ్ళకి తప్పని వ్యయ ప్రయాసలు.…

 

చీపురుపల్లి సూర్య:

 తెలుగుదేశం పార్టీలో చేరాలన్నా, ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్నా, బి ఫారం కావాలంటే రాజాం వెళ్లాల్సిందేనని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. చీపురుపల్లి శాసన సభ్యులు కిమిడి కళా వెంకటరావు నివాసం రాజాం కావడంతో పార్టీ క్యాడర్ తోపాటు అభ్యర్ధుల ప్రతి చిన్న విషయానికి రాజాం వెళ్లాల్సిందేనని దీంతో తమకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు టీడీపీ లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను కూడా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల, మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి మండలాల నుంచి రాజాం తీసుకు వెళ్లాల్సిందేనని దీంతో తమకు ఆర్థిక భారం తప్పడం లేదని తెలుగు తమ్ముళ్ళు విమర్శిస్తున్నారు. తీరా స్థానిక ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో ఉండి అభ్యర్థుల ఎంపిక చెయ్యాల్సింది పోగా రాజాం లో కూర్చునే నాలుగు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇక నామినేషన్లు వేసిన వారికి పార్టీ బి ఫారం కూడా తీసుకోవాలంటే రాజాం వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నలుగురిలో అభ్యర్థుల ఎంపిక చెయ్యాల్సింది పోయి అంత రహస్యంగా రాజాం లో చెయ్యడం అనుమానాలకు తావిస్తోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ అభ్యర్థిగా రౌతు కాము నాయుడు, మాజీ ఎంపీపీ రౌతు కాంతమ్మ, మాజీ జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఈమె భర్త వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ నలుగురితో నామినేషన్లు వేయించడం కూడా అనుమానాలకు తావిస్తోందని బాహాటంగానే పేర్కొంటున్నారు.  ముందుగా సర్పంచ్ రేసులో టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కాము నాయుడు ఉన్నారంటూ ప్రచారం చేసి చివరి నిమిషంలో జడ్పీటీసీగా నామినేషన్ వేయాలని సూచించడం ఆ వర్గం జీర్ణించుకోలేకపోతుంది. తాను సర్పంచ్ గా పోటీ చేస్తానని, జడ్పీటీసీ గా మరో వ్యక్తికి ఇవ్వాలని సూచించిన ఆ సూచన పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన వలిరెడ్డి శ్రీనివాస నాయుడు కి జడ్పీటీసీ కేటాయించాలని టీడీపీలోని ముఖ్య నాయకులు ఏకగ్రీవంగా చెప్పినా ఎందుకు శ్రీనివాస నాయుడు కి జడ్పీటీసీ కేటాయించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తమ్ముళ్లకు మిగిలింది. చీపురుపల్లి పట్టణంలో గట్టి పట్టున్న వలిరెడ్డి శ్రీనివాస నాయుడు సేవలను టీడీపీ ఎందుకు వినియోగించుకోలేకపోతుందన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచన చెయ్యాలని తమ్ముళ్ళు కోరుతున్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా