BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

బీఎస్పీ ఎన్నికల శంఖారావం ....స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాన్షీరాం 20వ వర్ధంతి మహాసభ

Select Suryaa Now
బీఎస్పీ ఎన్నికల శంఖారావం ....స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాన్షీరాం 20వ వర్ధంతి మహాసభ

విజయనగరం మేజర్ న్యూస్ : బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన మహనీయుడు మాన్యవర్ శ్రీ కాన్షీరాం  20వ వర్ధంతి సందర్భంగా జోన్-6 (ఉత్తరాంధ్ర) స్థాయి మహాసభ విజయనగరంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సభతోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఎస్పీ ఎన్నికల శంఖారావం పూరించింది.
ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత రాష్ట్ర కార్యదర్శి, జోన్-6 ఇంచార్జ్  సోము రాంబాబు  వహించారు. విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ నిధి లాడ్జి ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా నేషనల్ & స్టేట్ కో-ఆర్డినేటర్ సురేష్ ఆర్య , రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎం బాలయ్య (బాలన్న) , జోన్-6 చీఫ్ ఇన్చార్జ్  కరణం తిరుపతి రావు  హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో మాన్యవర్ కాన్షీరాం  చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల కాలంలో స్వర్గస్తులైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
ముఖ్య అతిథుల మాట్లాడుతూ ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాన్షీరాం  జీవితాన్ని వివరించారు. "1934 మార్చి 15న పంజాబ్ లోని రూప్ నగర్ జిల్లాలో జన్మించిన కాన్షీరాం , కేంద్ర ప్రభుత్వంలో శాస్త్రవేత్త ఉద్యోగాన్ని చేస్తూ డా. బి.ఆర్. అంబేద్కర్   పుస్తకం చదివి జీవితం మార్చుకున్నారు. 1971లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పెళ్లి కూడా చేసుకోకుండా బహుజన సమాజ విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.మొదట BAMCEF, తర్వాత DS-4, చివరగా 14 ఏప్రిల్ 1984న బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ని స్థాపించారు. 'బహుజన్ హితాయ - బహుజన్ సుఖాయ', 'ఓట్లు మావి - సీట్లు మీవా ఇక చెల్లదు', 'జిస్కీ జిత్నీ సంఖ్యా భారీ - ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ' వంటి నినాదాలతో బహుజనులలో చైతన్యం నింపారు.ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ ఏర్పాటులో, అమలులో కాన్షీరాం  పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది. మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని దేశవ్యాప్తంగా బహుజనులను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. బహుజన రాజ్యాధికారంలో యూపీ తర్వాత ఏపీనే' అనే నినాదాన్ని కాన్షీరాం  జరిగే ప్రతి సభలో ప్రస్తావించేవారు. ఆంధ్రప్రదేశ్ లో బహుజనుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇక్కడ కూడా బహుజన రాజ్యం సాధ్యమని గట్టిగా నమ్మేవారు. తన రాజకీయ చతురతతో యూపీలో నాలుగు సార్లు బహుజన ముఖ్యమంత్రిని చేసి రాజ్యాధికారం రుచి చూపించారు. డా. అంబేద్కర్ కు 1990లో భారతరత్న ఇప్పించిన ఘనత ఆయనదే" అని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలపై నేషనల్ కో-ఆర్డినేటర్ సురేష్ ఆర్య, స్టేట్ కో-ఆర్డినేటర్ బాలన్న, జోన్ ఇంచార్జ్ సోము రాంబాబు ప్రకటన: "రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీఎస్పీ ఎన్నికల శంఖారావం పూరించింది. విజయనగరం జిల్లాతో సహా జోన్-6 పరిధిలోని అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ వార్డుల్లో బీఎస్పీ ఏనుగు గుర్తుపై పోటీ చేస్తుంది. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు ఎన్నికలప్పుడే బహుజనులను గుర్తు చేసుకుని డబ్బు, మద్యం పంచి ఓట్లు దండుకుని గెలిచాక మోసం చేస్తున్నాయి. వారి పార్టీల్లో మనకు సీట్లు ఉన్నాయి కానీ రాజ్యాధికారంలో వాటా లేదు. బీఎస్పీ మాత్రమే బహుజనులకు రాజకీయ వాటా ఇచ్చే పార్టీ. ఈ ఎన్నికల్లో , ఎస్సీ  ఎస్టీ బీసీమైనార్టీ, మహిళలు, యువతకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తాం. బూత్ స్థాయి కమిటీలు పూర్తి అయ్యాయి, అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ఈ ఎన్నికలు మనకు సెమీ ఫైనల్ లాంటివి. స్థానిక సంస్థల్లో గెలిస్తేనే రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం సాధ్యం. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి ఏనుగు గుర్తును ఇంటింటికి తీసుకెళ్లాలి" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు పెద పెంకి శివ ప్రసాద్, రిటైర్డ్  పీరుబండి ప్రకాష్ రావు, జిల్లా నాయకులు బోను కృష్ణ, కొమ్ము సోములు, పెద్దాడ కనక మహాలక్ష్మి, విజయనగరం జిల్లా అధ్యక్షులు బుద్ధుడు, కారు గౌరీ, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చైతన్య కుమార్, విజయనగరం అసెంబ్లీ అధ్యక్షులు అర్జి పైడ్రాజు, ఎరుకొండ వెంకటరావు, బోను లక్ష్మి, ప్రకాష్ రావు మరియు జోన్-6 పరిధిలోని ఆరు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, సెక్టార్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.