BREAKING
ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా?

బాల్య వివాహాల నిర్మూలన మరియు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం"

Select Suryaa Now
బాల్య వివాహాల నిర్మూలన మరియు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం"

 

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి గారి ఆదేశాల మేరకు, బాల్య వివాహాల నిర్మూలన మరియు బాలలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో  చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని కర్నూలులోని నైస్ యూత్ ఫర్ కల్చర్ ఎడ్యుకేషన్ సొసైటీ  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని  జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ, నైస్ యూత్ ఫర్ కల్చర్ ఎడ్యుకేషన్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, కె.వి.ఆర్  కళాశాల మరియు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 117 సంయుక్తంగా నిర్వహించాయి. 
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్రమైన నేరమని, ప్రతి ఒక్కరూ బాలల హక్కులను గౌరవించి వారి రక్షణకు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా, ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగినట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, బాలబాలికలకు విద్య, భద్రత, సమాన అవకాశాలు కల్పించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు లయన్ టి. గోపీనాథ్, కె.వి.ఆర్  కళాశాల అధ్యాపకులు శ్రీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల రహిత సమాజ నిర్మాణం, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా మరియు శిశు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. బాలల భవిష్యత్తును కాపాడటం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం విద్యా విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులచే  బాల్య వివాహాల నిరోధం అమలు మరియు పోక్సో ఆక్ట్ పైన ప్రతిజ్ఞ చేయించారు.