BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్న బాబు

Select Suryaa Now
అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్న బాబు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి బీసీ జనరల్ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రధాన పార్టీల్లో అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నాయకులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ముఖ్యంగా అధికార కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతారన్న అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సముదాన పాలెపు వీరన్నబాబు పేరు కూటమి అభ్యర్థిత్వ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో వార్డు సభ్యుడిగా, ఎంపీటీసీగా పనిచేసిన ఆయనకు స్థానిక రాజకీయాలపై మంచి అనుభవం ఉంది. పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై స్పందిస్తారనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్ఠానం ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ నుంచి ఎవరు పోటీకి దిగుతారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండు ప్రధాన పార్టీల్లోనూ ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని నాయకుల వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తుందా? లేక కూటమి తన అభ్యర్థిని ముందుగానే ఖరారు చేస్తుందా? అన్నది గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకత్వ నిర్ణయం, స్థానిక నాయకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

బీసీ జనరల్ రిజర్వేషన్ నేపథ్యంలో అనపర్తి సర్పంచ్ ఎన్నికలపై గ్రామస్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరన్నబాబుకు కూటమి అవకాశం కల్పిస్తుందా? లేక మరో ఆశావహుడికి అవకాశం దక్కుతుందా? అన్నది వేచి చూడాలి. అధికారిక అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాతే అనపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల రాజకీయ చిత్రం పూర్తిగా స్పష్టమయ్యే అవకాశం ఉంది.