అంకుపల్లిలో కూటమి అభ్యర్థుల జోరు.. ఇంటింటా ప్రచారం.
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు మండలంలోని అంకుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి, ఆర్.వై పాలెం ఎంపీటీసీ అభ్యర్థి మైలా కోటేశ్వరరావు సంయుక్తంగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంతోపాటు ఎస్సీ కాలనీలోనూ అభ్యర్థులకు ప్రజలు సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రతి ఇంటికీ వెళ్లి గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపి, ఓటు వేసి గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థుల తరఫున కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఇంటింటి ప్రచారంలో గ్రామస్థుల నుంచి సానుకూల స్పందన లభించిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, సర్వేపల్లి జనసేన నాయకుడు నారదాసు రవి, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, పెంచల నాయుడు, ఆవులపాటి పిచ్చినాయుడు, నాగినేని పెంచల సిబ్బానాయుడు, నాగినేని ప్రభాకర్ నాయుడు, కొప్పాల రాఘవులు, మోహన్, గూడపాటి కృష్ణమూర్తి, వేంకటరమణయ్య, అత్తెన శ్రీనివాసులు, అడసనపల్లి పెంచలయ్య, యాదాల కోటి, రాపూరు రత్నం, పంతగిరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.