అంగన్‌వాడీల్లో పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి
గూడూరు, చిల్లకూరు, మేజర్‌న్యూస్ : అంగన్‌వాడీల్లో అందిస్తున్న పోసకాహారాన్ని లబద్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూపర్‌వైజర్ రేణుకమ్మ పేర్కొన్నారు. గురువారం పోషకాహార మాసోత్సవం ముగింపు సందర్భంగా రాజ్యలక్ష్మి కాలనీలో పోషణ మాసోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు మరియు తల్లులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజూ మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తున్న విధానం గురించి వివరించడం జరిగింది. అలాగే ప్రీ-స్కూల్ కార్యక్రమాలను ఆర్‌ఎల్‌ఎం మెసేజ్ ప్రకారం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు పోషకాహారం యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లలు ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు మరియు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉండే ఆహారంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు తీసుకోవాలన్నారు. పిల్లల బరువు, ఎత్తులను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. డాక్టర్ ఆకాష్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ రేణుక, అంగన్వాడీ కార్యకర్తలు భారతమ్మ, పద్మ, కమ్మవారిపల్లి రాధ, సుగుణ, హెల్పర్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.