BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

అంబేడ్కర్ నగర్‌లో డ్రెయిన్ల పూడికతీత చేపట్టాలి.. మురుగునీటి సమస్యతో ప్రజలకు ఇబ్బందులు.. ఎంహెచ్ఓ కు టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి సాకె లక్ష్మీనరసింహ వినతి

Select Suryaa Now
అంబేడ్కర్ నగర్‌లో డ్రెయిన్ల పూడికతీత చేపట్టాలి..  మురుగునీటి సమస్యతో ప్రజలకు ఇబ్బందులు..   ఎంహెచ్ఓ   కు టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి సాకె లక్ష్మీనరసింహ వినతి

( ఓబులేసు నేటి దినపత్రిక సూర్య కార్పొరేషన్ రిపోర్టర్ )

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్‌ అంబేడ్కర్ నగర్‌లో మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించి, పారిశుధ్య పనులు తక్షణమే చేపట్టాలని టీడీపీ 25వ డివిజన్ క్లస్టర్ ఇన్‌చార్జి సాకె లక్ష్మీనరసింహ నగరపాలక సంస్థ  ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి  కు విజ్ఞప్తి చేశారు.

అంబేడ్కర్ నగర్‌లోని ప్రధాన, అంతర్గత మురుగునీటి కాలువల్లో పూడిక, చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని ఆయన తెలిపారు. దీంతో మురుగునీరు రోడ్లపైకి చేరి స్థానిక నివాసితులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడం వల్ల దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపించడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని తెలిపారు.

యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి..

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంబేడ్కర్ నగర్‌లోని అన్ని ప్రధాన, అంతర్గత మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని సాకె లక్ష్మీనరసింహ కోరారు. అవసరమైన పారిశుధ్య సిబ్బందిని అదనంగా కేటాయించడంతోపాటు, పూడిక తొలగింపు యంత్రాలను అందుబాటులో ఉంచి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

నగరంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ మురుగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆయన కోరారు.