BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం..

Select Suryaa Now
అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం..

 

 

పాతపట్నం మేజర్ న్యూస్:

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ముఖ్య అతిథిగా విచ్చేసి, 'నెట్ జీరో హెల్తీ క్యాంపస్' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 'కిచెన్ గార్డెన్ ఫెస్టివల్'ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి బాటలు వేసుకోవచ్చని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులందరికీ కేటాయించిన కిచెన్ గార్డెన్ విభాగాల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను నాటారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అతిథులు, చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.