BREAKING
నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి

అంబరాన్నంటిన జర్నలిస్టుల దసరా సంబరాలు

Select Suryaa Now
అంబరాన్నంటిన జర్నలిస్టుల దసరా సంబరాలు

సింధియా, సూర్య : విశాఖజిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధి పారిశ్రామిక ప్రాంతంలో జర్నలిస్టుల దసరా సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం ఇండస్ట్రీయల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు అడిషనల్ డిజిపి, విశాఖ నగర పోలీసు కమీషనర్ శంఖబ్రత భాగ్చి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం మీడియా అని, మీడియా అనేది విజ్ఞానం, వినోదంతో పాటు సమాజంలో జరిగే ప్రతీ విషయాన్ని సంఘటనలను అందులోని వాస్తవాలను ప్రజలకు చేరువ చేసే అతిముఖ్యమైన సాధనం అని అన్నారు. పరిశ్రమలలో నెలకొన్న సమస్యలను ముందస్తుగా వార్తల రూపంలో  వెలుగులోనికి తీసుకొని రావటం ద్వారా అనేక ప్రమాదాలు జరగకముందే వాటిని నివారించే అవకాశం ఉంటుందని, అందువల్ల పారిశ్రామిక ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇండస్ట్రీయల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా పరిశ్రమల సంబంధిత వార్తలపై దృష్టి సారిస్తూ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి చట్టపరంగా అందవలసిన వేతనాలు సహా అన్ని హక్కులు అమలుపై డేగ కన్ను వేయాలని సూచించారు. అనేక రకాలైన సమస్యలతో సతమతమవుతున్న సమాజానికి ఆయాసమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టులు వైద్యుల వంటివారని అభివర్ణించారు. దసరా అంటే యుద్ధం అని అటువంటి యుద్ధంలో ఎప్పుడూ చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ఈ దసరా జర్నలలిస్టుల జీవితాలలో, వారి కుటుంబాలలో నెలకొన్న సమస్యలపై విజయం సాధించే శక్తిని ప్రతీ ఒక్కరికీ కలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బంగారు నాణేలు, మిఠాయిలను జర్నలిస్టుల కుటుంబసభ్యులకు కమీషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కాకి రాము, అధ్యక్షులు కొయిలాడ పరశురాం, కార్యదర్శి నూనెల పైడిరాజు, కోశాధికారి వాసుపల్లి గౌతమ్ ప్రకాష్ రావు, అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మనోజ్, మల్కాపురం, విశాఖపట్నం.