అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. పార్టీ నేతలతో తాజా రాజకీయాలపై చర్చ
అమరావతి: రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఈ భేటీలో రాష్ట్రంలోని వర్తమాన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కూటమి ప్రభుత్వ సమన్వయం మరియు పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు తదుపరి కార్యచరణపై సీఎం నేతలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.