BREAKING
దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు

అద్దంకి, ఏల్చూరులో 67.28 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ.

Select Suryaa Now
అద్దంకి, ఏల్చూరులో 67.28 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ.

 

ఏల్చూరులో రూ.35.78 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్‌.

అద్దంకిలో రూ.30 కోట్లతో సీసీ రోడ్లు.. రూ.1.50 కోట్లతో స్టేడియాలు.

*నిషేధిత భూములకు చట్టపరంగా పరిష్కారం*

*ఎల్ నినోతో పెరిగిన విద్యుత్ వినియోగం*

*సోలార్ వినియోగానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపాలి*

- *ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్*

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యుత్‌ వ్యవస్థ బలోపేతం, దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సంత‌మాగులూరు మండ‌లం ఏల్చూరు, అద్దంకి ప‌ట్ట‌ణాల‌లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో రూ.35.78 కోట్లతో 12 ఎకరాల్లో నిర్మించనున్న 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సబ్‌స్టేషన్ పూర్తయితే ఏల్చూరు పరిసర ప్రాంతాలకు లోవోల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. రెనెవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్  ఏర్పాటుతో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ యువతకు ఉద్యోగ‌ అవకాశాలు లభిస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. జోన్ కు భూములిచ్చిన కుటుంబాల త్యాగాన్ని గుర్తించి ఉద్యోగాల భర్తీలో ఆయా కుటుంబాల యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయ‌న‌ చెప్పారు. 

అద్దంకి పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో రూ.1.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఇండోర్ షటిల్ కోర్టు, జిమ్‌లకు మంత్రి భూమిపూజ చేశారు. త్వరలో సీఎస్ఆర్ నిధులతో లైబ్రరీ భవనాన్ని కూడా నిర్మిస్తామన్నారు. అన్ని పనులనూ ప్రభుత్వమే చేయడం సాధ్యం కాదని, సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మించడంతోపాటు విద్యార్థులకు సైకిళ్లు, దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిళ్లు అందించామని చెప్పారు. అద్దంకి పట్టణంలో రూ.30 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.

అద్దంకిలో పట్టణంలో ఇప్పటికే నాలుగు వేల కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను ఐదు పైసలు కూడా పెంచలేదని, ఇకపైనా పెంచబోమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఛార్జీలు పెంచడంతోపాటు వెళ్తూ వెళ్తూ రూ.20 వేల కోట్ల ఈఆర్సీ భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపిందని ఆయ‌న‌ విమర్శించారు. ఎల్‌నినోతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింద‌న్నారు. ఈ ప్రభావంతో విద్యుత్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.78 వేల సబ్సిడీతో అందుబాటులో ఉన్న పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే పీక్ అవర్స్‌లో విద్యుత్ సమస్యలను తగ్గించవచ్చన్నారు. సోలార్ వినియోగానికి ప్ర‌జ‌లు మ‌రింత‌గా మొగ్గు చూపాల‌ని ఆయ‌న‌ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గి వ్యవసాయం దెబ్బతినడంతో బియ్యం ధరలు పెరిగాయన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వమే కిలో బియ్యాన్ని రూ.48కి విక్రయిస్తోందని తెలిపారు.

*దీర్ఘ‌కాలిక భూ స‌మ‌స్య‌ల‌కు చ‌ట్ట ప‌రిధిలో ప‌రిష్కారం...*

అద్దంకి నియోజకవర్గంలో నిషేధిత భూములు, దేవాదాయ శాఖ భూములు, 22ఏ జాబితా కారణంగా ఏళ్ల తరబడి దీర్ఘ‌కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. దీర్ఘకాలిక భూ సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు లేని భూముల సమస్యలను సీఎం ఆదేశాలకు అనుగుణంగా పరిష్కరిస్తున్నామన్నారు. నిషేధిత జాబితాలో ఉండటంతో భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడం, వాటిని పిల్ల‌ల‌కు కూడా బదలాయించలేకపోతున్న పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారు.  దైవాలరావూరు గ్రామం మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయ‌న‌ తెలిపారు.

దైవాల‌రావూరు సమస్యను సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే పరిష్కరించామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. అదే విధంగా దీర్ఘకాలంగా నిషేధిత జాబితాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న భూ సమస్యలను గుర్తించాలని ఇప్పటికే తహశీల్దార్లను ఆదేశించినట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చట్టపరంగా అవకాశం ఉన్న ప్రతి భూ సమస్యనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు కూట‌మి నేత‌ల‌తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.