BREAKING
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన కార్తీక్ ఆర్యన్, శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత... రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..

అభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రజలు

Select Suryaa Now
అభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రజలు

నెల్లూరు,  మేజర్ న్యూస్   :    ప్రజా మద్దతుతో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం – అభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రజలు!

గత నెల రోజులుగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్)లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం యథావిధిగా రామజీ నగర్‌లోని 5, 6వ వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటి గడపను సందర్శించి, ప్రజలతో మమేకమై కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

పవన్ కళ్యాణ్  నిర్ణయాలు – రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది  జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో, సంయమనంతో, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు నేడు కూటమి ప్రభుత్వ పాలనకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన అనుసరిస్తున్న విధానం రాష్ట్ర రాజకీయాల్లో బాధ్యతాయుతమైన నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అభివృద్ధి పథంలో రాష్ట్రం.  నెల్లూరు అభివృద్ధికి మంత్రి పొంగూరు నారాయణ విశిష్ట సేవలు  నెల్లూరు నగర అభివృద్ధిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ  కీలక పాత్ర పోషిస్తున్నారని జనసేన నాయకులు తెలిపారు. విద్యా రంగంలో మెరుగైన అవకాశాలు, వైద్య సేవల అభివృద్ధి, నగర మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపాధి, అభివృద్ధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి నుంచి నెల్లూరు నగర పురోగతి వరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పురపాలక శాఖ మంత్రిగా నారాయణ  అందిస్తున్న సేవలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని పేర్కొన్నారు. నెల్లూరు నగరాన్ని మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.

ప్రజల విశ్వాసమే మా బలం – అభివృద్ధికి మా మద్దతు  రామజీ నగర్ 5, 6వ వీధుల్లో నిర్వహించిన ప్రచారంలో పలువురు కుటుంబాలు తమ అభిప్రాయాలను పంచుకుంటూ, ప్రజా సమస్యలపై పోరాడే నాయకత్వానికి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పాలనకు మద్దతుగా నిలుస్తామని చెప్పడం సంతోషకరమని నాయకులు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా సమన్వయంతో పనిచేసే ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలని వారు కోరారు. నెల్లూరు నగర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ విలువైన మద్దతు అందించి విజయపథంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు.   ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకులతో పాటు నాగేంద్ర బాలు, నరహరి, కృష్ణమోహన్ రెడ్డి ,బాలాజీ,వీరమహిళలు ప్రవల్లిక, ప్రశాంతి,సుప్రియ,విజయ, ఆమని, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, కల్పన, పద్మ, లావణ్య తదితరులు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.