అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు
వింజమూరు మేజర్ న్యూస్ : భారతరత్న మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మన అందరి ప్రియతమ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జన్మదినోత్సవ వేడుకలను గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మా శిలామణి శ్రీ వివేకానంద కళాశాల కరస్పాండెంట్ మద్దూరు గోపాల్ రెడ్డి విశ్రాంత ఆర్జెడి డి సి వెంగయ్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాలని తెలిపారు చిన్నతనంలో పేపర్లను అమ్ముతూ తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు పేదరికం అయినా ఆయన పట్టుదలను ఆపలేకపోయిందన్నారు అబ్దుల్ కలాం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారన్నారు తర్వాత డిఆర్డిఓ ఇస్రోలో చేరి భారతదేశానికి ఎన్నో క్షిపణులను అందించారు అందుకే ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అన్నారు అగ్ని పృథ్వి క్షిపణుల తయారీ ఆయన కృషి ఫలితమేనని తెలిపారు అబ్దుల్ కలాం ఒక వ్యక్తి కాదు ఆయన ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం ఒక మార్గదర్శి అని తెలిపారు సామాన్య కుటుంబంలో జన్మించిన తన కృషి పట్టుదలతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మహనీయుడు అన్నారు విద్యార్థుల దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన యువతలో జ్ఞానజ్యోతిని వెలిగించిన మహా వ్యక్తి అన్నారు ఆయన 2002 నుండి 2007 వరకు భారతదేశ్యానికి పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారని తెలిపారు రాష్ట్రపతి భవన్ ను ప్రజల భవనగా మార్చిన మహా వ్యక్తిగా కొనియాడారు వెళ్లాలంటే ఆయనకు ఎంతో ఇష్టం కలం నిరాడంబర జీవితాన్ని గడిపారు తన సొంత ఖర్చులు తన జీతం నుండి గడుపుకునే కంటి వాడే తప్ప ప్రభుత్వ సొమ్మును ఉపయోగించలేదన్నారు కలాం ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు ఉన్నారు కలలు కనండి ఆ కలలను ఆలోచనలుగా మార్చండి ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టండి అని తెలిపేవారున్నారు 2015 లో జూలై 27వ తేదీన షిల్లాంగ్ లో విద్యార్థులకు పాఠం చెబుతూనే తుది శ్వాస విడిచారన్నారు చివరి వరకు ఆయన ఒక ఉపాధ్యాయునిగానే బ్రతికారు అన్నారు మనం కూడా పెద్ద కలలుకని ఆయన ఆశయాలను నిర్వహించి భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుదాం అన్నారు ఆయనకు 1981లో పద్మభూషణ్ 1990లో పద్మ విభూషణ్ 1997లో భారతరత్న అవార్డులను ప్రభుత్వం అందించింది అన్నారు కలాం గొప్ప రచయిత కూడా యువతలో ఆలోచన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పలు రచనలు కూడా చేశారన్నారు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కే రామారావు పశువర్ధక శాఖ ఏడిహెచ్ రఘునాథ్ మాజీ జెడ్పిటిసి సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దూరు రాజగోపాల్ రెడ్డి మండల కన్వీనర్ జగదీశ్వర్ రెడ్డి డిపి వెంగయ్య బయపరెడ్డి వై హరినాధ రెడ్డి పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు