ఆత్మకూరులో మహిళా కిసాన్ దివస్ కార్యక్రమం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులోని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ యార్డు ఆవరణలో గురువారం మహిళా కిసాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏ డి ఏ ఈ . శైలజ కుమారి మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ స్కీమ్స్ గురించి,ఏ పి ఏ ఐ ఎం ఎస్ యాప్ యూరియా డిస్ట్రిబ్యూషన్ లో వచ్చినటువంటి కొత్త యాప్ ను గురించి వివరించారు. కేవీకే శాస్త్రవేత్త కే . కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళా రైతులకు అందుబాటులో ఉన్నటువంటి శిక్షణ కార్యక్రమములు అయినటువంటి పుట్టగొడుగుల పెంపకం, వర్మి కంపోస్టు తయారీ విధానం, మిద్దె తోటల పెంపకం, శిక్షణ కార్యక్రమాలు శిక్షణా తరగతుల గురించి. మరియు కోడి పిల్లల ఇంక్ బేసిన్, చాక్లెట్ తయారీ, దాల్ మిల్స్, నూనె తీసే మిషన్ లను సబ్సిడీపై కేవీకే లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని మహిళా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు . ఉద్యానవన శాఖ ఆఫీసర్ సి హెచ్ . రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యానవన పంటల్లో ఇస్తున్నటువంటి స్కీమ్స్, సబ్సిడీలో ఇస్తున్న పండ్ల మొక్కలు, పామాయిల్,, షెడ్ నెట్స్, మల్చింగ్ షీట్స్, ఫామ్ పౌండ్, తదిర స్కీమ్స్ గురించి వివరించడం జరిగింది. ఏ . ఎస్ . పేట వ్యవసాయ అధికారి ఎం . సురేష్ మాట్లాడుతూ భూసార పరీక్షల విశిష్టతను గురించి తెలియజేశారు. టెక్నికల్ వ్యవసాయ అధికారి పి . చంద్రబాను మాట్లాడుతూ ఆర్గానిక్ ఎరువులు పురుగు మందుల గురించి వివరించడం జరిగింది. ఏపీసీఎన్ ఎఫ్ లో పనిచేస్తున్నటువంటి ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ వెంకటలక్ష్మి, ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎటిఎం మోడల్స్, ఘన ద్రవ జీవామృతం ఎన్ పి ఎం షాపు గురించి వివరించడం జరిగింది. మహిళా రైతులు పద్మ, సుబ్బమ్మ, తిరుపతమ్మ వారు చేసినటువంటి నేచురల్ ఫామింగ్ గురించి వివరించడం జరిగింది.