ఆత్మకూరులో ఘనంగా సేవాజ్యోతియాత్ర
ఆత్మకూరులో ఘనంగా సేవా జ్యోతి యాత్ర
--భారీ మోటర్ బైక్ ర్యాలీ --25 ఏళ్ల నరేంద్ర మోడీ ప్రజాసేవ
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 సంవత్సరాల పాటు ప్రజాసేవలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా విజయవంతంగా కొనసాగిన సందర్భంగా బుధవారం ఆత్మకూరులో కూటమి ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్ నుండి భారీ మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు జ్యోతిని చేతబూని ముందువైపు నిలవగా తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు మోటార్ బైకులపై అనుసరించారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్ నుండి బి ఎస్ ఆర్ సెంటర్, సోమశిల రోడ్డు సెంటర్, ఎల్లార్ పల్లిల మీదుగా ఆర్టీసీ డిపో వరకు కొనసాగించి తిరిగి బస్టాండుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 13 సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగిన అరుదైన గౌరవం దక్కించుకున్న మహానేత నరేంద్ర మోడీ అని నాయకులు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ జిందాబాద్, కూటమి నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అటు 12 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఇటు 13సంవత్సరాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అటు రాష్ట్ర ఇటు దేశ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి విశేష సేవలు అందించారని వారు కొనియాడారు. వికసిత్ భారత్ పేరుతో ఆయన భారత దేశ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు పులిమి శైలజా రెడ్డి,పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తోడేటి వెంకటయ్య, జిల్లా బిజెపి సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు నున్న సంతోష్ కుమార్, బిజెపి నాయకులు కరటంపాడు సుధాకర్, డేగ పెంచల్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, నలిశెట్టి శ్రీనివాసులు, తెలుగుదేశం కి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సర్దార్,మాజీ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి,పొడమేకల పెంచలయ్య యాదవ్, దగ్గుబాటి శివ కోటారెడ్డి, షేక్ గౌస్ బాషా, మాదాల శ్రీనివాసులునాయుడు, షేక్ మహబూబ్ బాషా, తెలుగుదేశం నాయకులు దాసరి మధుసూదన్ రావు, యు.బాలకొండయ్య, పి. సాగర్, గుండాల మధుసూదన్ రెడ్డి, తోట సందీప్, నల్లబోతుల వెంకటేశ్వర్లు, కాజా మస్తాన్, కాపా వెంకటసుబ్బయ్య, ఎన్ చిన్నబ్బయ్య, రబ్బాని, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.