BREAKING
25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం ఆపదలో జనసైనికుడికి జనసేన అండ పెనుగంచిప్రోలులో టీడీపీ మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య ప్రెస్ మీట్* *కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో విశ్వాసం - రానున్న ఎన్నికల్లో అఖండ విజయం మాదే*

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

మెలియాపుట్టి: ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పనస రమేష్‌, ఎస్‌.గౌరమ్మ, పల్ల క్రిష్ణ మాట్లాడుతూ.. ఆశాలకు కనీస వేతనం అమలు చేసి పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్‌ఐ, జీపీఎఫ్‌ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.గర్భిణులు, చిన్నారుల సంరక్షణ, టీకాలు, వ్యాధుల నివారణలో ఆశాలు సుమారు 20 ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. కోవిడ్‌ సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని పేర్కొన్నారు. ఆశాలకు అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని, ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌ను నియమించాలని కోరారు. రూ.10 లక్షల బీమా, నాణ్యమైన యూనిఫాం, పని సామగ్రి అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శిల్లా భవాని, స్వర్ణలతా పట్నాయక్‌, పి.జయలక్ష్మి, పావని, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.