ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ తనిఖీ
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్ ను గురువారం నాడు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి ఎస్. ఆంజనేయులు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి తనిఖీలో పాల్గొన్నారు.అలాగే ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీలో భాగంగా గోడౌన్లకు వేసిన సీలు, సీసీ కెమెరాల పనితీరు మొదలైన భద్రతా పరమైన చర్యలను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, ఆర్డిఓ ఎన్ ఎస్ అనూష తదితరులు పాల్గొన్నారు.