BREAKING
దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు

ఆనారోగ్యంతో బాధపడే వారికీ, ఆపన్న హస్తం .ముఖ్యమంత్రి సహాయనిధి.

Select Suryaa Now
ఆనారోగ్యంతో బాధపడే వారికీ, ఆపన్న హస్తం  .ముఖ్యమంత్రి సహాయనిధి.

 

గిద్దలూరు నియోజకవర్గంలోని 66 మందికి రూ. 31,36,838 - 00 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*

గిద్దలూరు మేజర్ న్యూస్ :

*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న 66 మందికీ 24 వ విడతగా మంజూరు అయిన, రూ 31,36,838 - 00 లు (అక్షరాల ముప్పై ఒక లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు)  ముఖ్యమంత్రి సహాయ నిధి , చెక్కులను అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికీ అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందవచ్చునన్నారు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1336 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 12,29,05,191 - 00 లు (అక్షరాల పన్నెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల అయిదు వేల నోట తొంబై ఒకటి రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు..*

*ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లు, ZPTC లు , మండల పార్టీ అధ్యక్షులు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.*