ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయనగరం జిల్లా బొబ్బిలి దావాలా వీధికి చెందిన చనమల్ల కనకరాజు, కమల దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి పథకానికి రూ.3 లక్షలు విరాళంగా సమర్పించారు. ఆలయ పర్యవేక్షకులు సత్యనారాయణ, అర్చక స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధలతో విరాళాన్ని అందజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.