BREAKING
పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరినీ కలవడం నా బాధ్యత.. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్! అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం

ఒంగోలు నగర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి

Select Suryaa Now
ఒంగోలు నగర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి

ఒంగోలు: కూటమి ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు కృషి చేస్తున్నారని ఆయన కుమార్తె దామచర్ల అనీషా లక్ష్మి పేర్కొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

కూటమి బలపరిచిన ఒంగోలు టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పతో కలిసి దామచర్ల అనీషా లక్ష్మి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు .

ఒంగోలు నగరంలోని 56వ డివిజన్, 57, 58, 59, 60వ డివిజన్ లలో కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అడుగడుగునా మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు.

ఒంగోలు మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

గత రెండేళ్లలో ఒంగోలు నగర అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, నగర అభివృద్ధి కొనసాగేందుకు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అనీషా లక్ష్మి తెలిపారు.

ఈ కార్యక్రమంలో 56 డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఏలూరి రజని, 57వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ సూదనగుంట అనూష, 58వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి మన్నే మల్లికార్జునరావు, 59వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నుసుం చెన్నయ్య, 60వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి తిప్పరమల్లి రవితేజ తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.