వైసిపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి పై ఓ అవ్వ ఆప్యాయత పలకరింపు.
సీతమ్మధార, మేజర్ న్యూస్ ; వైసిపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి దక్షిణ నియోజకవర్గం లో ఫిషింగ్ హార్బర్ ప్రచారంలో భాగంగా ఓ అవ్వ ఆప్యాయంగా ప్రేమతో పలకరించిన పలకరింపు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వరదు కళ్యాణి మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులు ఎంతగానో తన సొంత బిడ్డల్లాగా ఆదరించారని ఆమె ఆనందంతో ఉప్పొంగి పోయారు. మేయర్ గా గెలిచిన తర్వాత మత్స్యకారులు సమస్యలను పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి దక్షిణం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు