అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు
కోయిలకొండ సూర్య న్యూస్:
మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్సై నాగరాజు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాగుల పరిసర ప్రాంతాలలో ఇసుక తరలించకుండా పోలీసుల ద్వారా గట్టినిగా నియంత్రణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. ఇసుక ట్రాక్టర్ హన్వాడ మండలంవేపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి దాన్ని గుర్తించి కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మల్లికార్జున్ గౌడ్, కోయిలకొండ