BREAKING
జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి 2026 నాటి పతనం తర్వాత కొలుకోనున్న చైనా ఆటోమొబైల్ రసాయనం వృద్ధి అంచనాల కోత, రుణ వ్యయాల భయాలతో 11 నెలల కనిష్టానికి శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నేడు ముంబైలో తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల కీలక భేటీ.. బ్రెజిల్‌లో లూలా గెలిస్తే మార్కెట్లలో భారీ మార్పులు: ఇన్వెస్టర్ల అంచనాలు ఇనుప ఖనిజం ధరల వెనుక ఆస్ట్రేలియా, చైనా మధ్య రగులుతున్న ప్రచ్ఛన్న యుద్ధం చైనా ఉద్దేపనలు ఎందుకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు? ఒంగోలు నగర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గోకల్‌దాస్ వ్యూహం ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించిన ఇన్ఫోసిస్ దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలి. యువత క్రీడల్లో రాణించాలి: పటోళ్ల ఆదిత్య రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షల విరాళం అశ్విజ పౌర్ణమి సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం

విద్యార్థులకు బ్యూటీ అండ్ వెల్ నెస్ ఇంటర్న్ షిప్ శిక్షణ

Select Suryaa Now
విద్యార్థులకు బ్యూటీ అండ్ వెల్ నెస్ ఇంటర్న్ షిప్ శిక్షణ

 

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగుళూరు మోడల్ స్కూల్ కు చెందిన 11వ తరగతి విద్యార్థులకు  బ్యూటీ అండ్ వెల్ నెస్ ఇంటర్న్ షిప్ లో శిక్షణ ఇస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ప్రశాంతి బ్యూటి సెలూన్ నిర్వహకులు తెలిపారు. విద్యార్థులకు దసరా సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.అక్టోబర్ 10 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ పది రోజుల పాటు కొనసాగడం జరిగిందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫేషియల్, క్లీనప్, థ్రెడింగ్, హెయిర్ కేర్, హెయిర్ స్టైలింగ్, మేకప్ తదితర అంశాల్లో ప్రత్యక్ష ప్రాక్టికల్ శిక్షణ అందించినట్లు వివరించారు. ఈ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని బొంగుళూరు మోడల్ స్కూల్ బ్యూటీ అండ్ వెల్ నెస్ వృత్తి విద్యా శిక్షకురాలు వకుల పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు.విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానంతో పాటు వృత్తికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను వాస్తవ పని ప్రదేశంలో ఆచరణలో పెట్టే అవకాశంతో విద్యార్థులు వృత్తిపరమైన అనుభవాన్ని అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ శిక్షణ ద్వారా బ్యూటీ అండ్ వెల్ నెస్ రంగంలోని పనితీరుపై అవగాహన పెంపొందించేలా ఇంటర్న్ షిప్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి,  స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

---------

శేరిబాయి గణేష్, మేజర్ న్యూస్ , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి