దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలి.
దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు.
విజయదశమి సందర్భంగా ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని న్యూ సుభాష్‌నగర్ కాలనీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత యువసేన అధికారి, సంఘ సేవకులు సీబీఆర్ ప్రసాద్, తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ గాజుల శివశంకర్ హాజరై మాట్లాడారు.
శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించిన సందర్భంగానే కాకుండా, పాండవుల విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారని తెలిపారు.1925లో నాగ్‌పూర్‌లో విజయదశమి రోజున డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్‌ను స్థాపించారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశ నిర్మాణం, సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వయంసేవకులు తొర్రూరు, తుర్కయంజాల్ డివిజన్ లో పదసంచాలన్ నిర్వహించారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.