BREAKING
ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం సుధాకర్ మృతుకపోలీసుల వైఫల్యమే.

21వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక దీక్ష. ఉండి

Select Suryaa Now
21వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక దీక్ష. ఉండి

ఉండి, మేజర్ న్యూస్:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ న్యాయమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతూ ఉండి మండల వీఆర్ఏలు మంగళవారం పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోస్టుకార్డులను అమరావతిలోని సచివాలయానికి పంపించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ,  మండల అధ్యక్షులు వై. ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి పైగా వీఆర్ఏలు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం 21 రోజులుగా సహాయ నిరాకరణ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి తమపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల కార్యదర్శి వి.హరి దుర్గా దేవి  ఉపాధ్యక్షులు పాలా శ్రీనివాసరావు, కోశాధికారి సూరిబాబు, వీఆర్ఏలు గణేష్, గోపాలం, శ్రీమణి మాల, సింహాచలం, ఏసురత్నం, పార్వతీదేవి, ప్రశాంత్, బాలామణి పాల్గొన్నారు.

 

 రిపోర్టర్. రాజు.ఉండి పశ్చిమ గోదావరి జిల్లా