ఈ నెల 9న ఉమ్మడి కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా జట్ల ఎంపికలు..
గన్నవరం, మేజర్ న్యూస్.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9న అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు సమాఖ్య కార్యదర్శులు రవీంద్ర, భవాని తెలిపారు. మల్కాంబ్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. విజయవాడ బి.ఎస్.ఆర్.కె. మున్సిపల్ పాఠశాలలో మల్కాంబ్, నూజివీడులోని బిస్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బాస్కెట్‌బాల్, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 9న ఉదయం 9 గంటల్లోగా ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఆయా వేదికలకు చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే సీబీఎస్‌ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ ఎంపికలకు అనర్హులని స్పష్టం చేశారు.
గుర్రం ప్రసాద్, గన్నవరం.