15వ వార్డులో ముమ్మర ప్రచారం...
నరసన్నపేట నవంబర్ 20 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పొట్నూరు వాణి సాయి ప్రసాద్ 15వ వార్డు సభ్యులు వైశ్య రాజు కాత్యాయని శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
పప్పుల వీధి, బొడ్డవలస, చిత్రి వీధి ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తమకు ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు మద్దతు తెలిపి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డు అభివృద్ధితో పాటు గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ప్రచారంలో వార్డు సభ్యులు వైశ్యరాజు కక్ష్యాని తదితరులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు. ఆయా వీధుల్లో అభ్యర్థులు నిర్వహించిన ప్రచారానికి స్థానికుల నుంచి స్పందన లభించింది.